- Advertisement -
తాజాగా ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నటుడు మోహన్ బాబు, రజనీ కాంత్ లో ఉన్న తనకున్ స్నేహాన్ని గుర్తుచేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రజనీకాంత్ గొప్ప వ్యక్తి, తనకు బెస్ట్ ఫ్రెండ్ అని అన్నారు. మా ఇద్దరి మధ్య 50 ఏళ్లకు పైగా అనుబంధం ఉందని, రజనీకాంత్ ను హైమ్ బ్లడీ తలైవా అని ముద్దుగా పిలిచేవాడినని, మా హధ్ద అంత చనువుందని మోహన్ బాబు అన్నారు. నటులుగా పరిచయం కాకముందు మద్రాస్ ప్లాట్ ఫామ్ పై మొదటిసారిగా కలుసుకున్నామని, అప్పటి నుంచి మా బంధం కొనసాగుతుందన్నారు. నాకు గతంలో ఎంత కోపం ఉండేదో నీకు తెలుసు. నేను తర్వాత కాలంలో దాన్ని వదిలేశాను. నువ్వెందుకు వదల్లేకపోతున్నావు, పుస్తకాలు చదవడం కాదుఅందులోని సారాంశాన్ని అర్థం చేసుకొని కోపాన్ని వదిలెయ్ అని సలహా ఇచ్చాడని మోహన్ బాబు గుర్తు చేసుకున్నారు.
- Advertisement -