- Advertisement -
హైదరాబాద్: బిసిలకు 42శాతం రిజర్వేషన్ల కోసం పకడ్బందీగా కులగణన చేశామని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ (Whip Aadi Srinivas) తెలిపారు. బిసి రిజర్వేషన్లపై తమ చిత్తశుద్ధిని నిరూపించుకున్నాం అని అన్నారు. ఆయన గాంధీభవన్ లో మీడియాతో మాట్లాడుతూ..9వ షెడ్యూల్ లో చేర్చాల్సింది కేంద్ర ప్రభుత్వమే అని మైనార్టీ రిజర్వేషన్లు సాకుగా చూపి బిసిలకు బిజెపి అన్యాయం చేస్తోందని మండిపడ్డారు. బిసి రిజర్వేషన్లపై (BC reservations) సిఎం రేవంత్ రెడ్డి చిత్తశుద్ధిని ప్రశ్నించే హక్కు బిజెపికి లేదని విమర్శించారు. బిజెపి తెలంగాణ అధ్యక్షుడు రామచందర్ రావు బిసి రిజర్వేషన్లకు వ్యతిరేకి అని ఆది శ్రీనివాస్ దుయ్యబట్టారు.
- Advertisement -