Wednesday, July 23, 2025

ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి

- Advertisement -
- Advertisement -

రాజస్థాన్ లో సోమవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. వివరాలలోకి వెళితే.. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వేర్వేరు ప్రాంతాలకు చెందిన పలువురు రెండు కార్లలో ఖతుష్యం ఆలయ సందర్శనకు వెళ్లి తిరిగి వస్తుండగా జాతీయ రహదారి 11పై రెండు కార్లు ప్రమాదానికి గురైనాయి. ఈ ఘటనలో రెండు కార్లు నుజ్జునుజ్జు అయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. కార్లల్లో చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు కట్టర్లను ఉపయోగించవలసి వచ్చింది. ఈ ప్రమాదంలో నలుగురు ఘటనాస్థలిలోనే మృతి చెందగా మరో వ్యక్తి ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన వారిని పోలీసులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News