Wednesday, July 23, 2025

వీరమల్లు క్రేజ్.. పెట్టిన క్షణాల్లోనే అమ్ముడుపోయిన టికెట్లు

- Advertisement -
- Advertisement -

పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ చాలా రోజుల తర్వాత వెండితెరపై సందడి చేయనున్నారు. ఆయన నటించిన ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) చిత్రం జూన్ 24వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మంగళవారం ఈ సినిమా టికెట్ బుకింగ్స్ మొదలయ్యాయి. బుక్ మై షో, డిస్ట్రిక్ట్ యాప్‌లలో టికెట్స్ బుకింగ్ మొదలైన క్షణాల్లోనే సోల్డ్ అవుట్ అవుతున్నాయి. ఎపిలో పెయిడ్ ప్రీమియర్‌కు సంబంధించిన షో టికెట్స్ కూడా అందుబాటులోకి తెచ్చారు.

ఇక తెలంగాణ, ఎపిల్లో హరిహర వీరమల్లు (Hari Hara Veera Mallu) సినిమాకు టికెట్ ధరలు పెంచుకొనేందుకు ప్రభుత్వాలు అనుమతి ఇచ్చాయి. ‘పుష్ప-2’ సినిమా తర్వాత ఈ సినిమాకు తెలంగాణలో ప్రీమియర్ షోలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో మొదటి షోలోనే సినిమాను చూసేందుకు అభిమానులు తెగ ఉత్సాహం చూపిస్తున్నారు. ఆకాశాన్ని తాకేలా టికెట్ ధరలు ఉన్నా వాటిని కొనేందుకు ఫ్యాన్స్ వెనకాడటం లేదు. దీంతో టికెట్లు ఆన్‌లైన్‌లో హాట్ కేకుల్లా అమ్ముడు పోతున్నాయి.

క్రిష్, జ్యోతి కృష్ణ దర్శకత్వంలో రూపొందిన హరిహర వీరమల్లు సినిమాలో హీరోయిన్‌గా నిధి అగర్వాల్, విలన్ ఔరంగజేబ్ పాత్రలో బాబీ డియోల్ నటించారు. మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్‌పై ఈ సినిమాను ఎఎం రత్నం నిర్మించారు. ఈ సినిమాకి ఆస్కార్ అవార్డు విజేత కీరవాణి సంగీతం అందించగా.. పవన్‌కళ్యాణ్ ఈ సినిమా కోసం మరోసారి మార్షల్ ఆర్ట్స్‌లో ట్రైనింగ్ తీసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News