- Advertisement -
హైదరాబాద్: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రోడ్లన్నీ జలమయంగా మారాయి. వరదలు ఎక్కువగా ఉండడంతో వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు నీటిలో మునిగిపోయాయి. బాలికల వసతి గృహంలోకి వరద నీరు చేరింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో సుమారు నాలుగు గంటల పాటు భారీ వర్షం కురిసింది. గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాలలోకి భారీగా వర్షపు నీరు చేరింది. బాలికలను హుటా హుటిన ప్రభుత్వ కళాశాలకు తరలించారు.
- Advertisement -