లక్నో: ఓ దంపతులు సంతోషంగా జీవిస్తున్న క్రమంలో భార్య ప్రియుడితో వెళ్లిపోవడంతో అతడితో కలిసి ఉండాలని భర్త రాతపూర్వక ఒప్పంద పత్రాన్ని రాసి ఇచ్చాడు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం కేరి జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… పర్సాముర్తా గ్రామానికి చెందిన రామ్‌చరణ్ అనే వ్యక్తి(47) 20 సంవత్సరాల క్రితం జానకీదేవిని(40) పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. రామ్‌చరణ్ ముంబయిలో టైల్స్ వర్కర్‌గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.
జానకి సొంతూరులో ఉంటూ పిల్లలను చదివిస్తూ కాలం వెళ్లదీస్తోంది. అదే గ్రామానికి చెందిన సోను ప్రజాపతితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ప్రియుడితో కలిసి ఒకే ఇంట్లో ఉండడంతో భార్యను భర్త నిలదీయడంతో క్షమాపణ చెప్పింది. కొంతకాలం భర్త కలిసి జీవించిన తరువాత మళ్లీ ప్రియుడి వద్దకే వెళ్లింది. దీంతో భవానీగంజ్ పోలీస్ స్టేషన్‌లో భర్త ఫిర్యాదు చేశాడు. తన భార్య ఆమె ప్రియుడితో కలిసి ఉండడం తనకు ఇష్టమేనని రాతపూర్వక పత్రాన్ని పోలీస్ స్టేషన్‌లో సమర్పించాడు. గతంలో ఇలాగే చేస్తే క్షమించానని, ఇప్పుడు మళ్లీ తనని ఏమైనా చేస్తుందని భయంతోనే భార్యతో కలిసి ఉండలేనని రామ్‌చరణ్ పేర్కొన్నారు. అందుకే ప్రియుడితో కలిసి భార్యకు ఒప్పంద పత్రాన్ని రాసి ఇచ్చానని వివరించాడు.