హైదరాబాద్: సికింద్రాబాద్ లోని బోయిన్ పల్లి వ్యవసాయ మార్కెట్ ను రైతు కమిషన్ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు చేశారు. బుధవారం ఉదయం 6 గంటలకే బోయిన్ పల్లి మార్కెట్ కు కమిషన్ బృందం చేరుకొని దాదాపు గంటన్నర వరకు మార్కెట్ లో పర్యటించి అక్కడి సమస్యలు, అధికారుల నిర్లక్ష్యాన్ని గుర్తించారు. వివిధ రాష్ట్రాల నుండి బోయిన్ పల్లి మార్కెట్ కు వచ్చిన రైతులు, వ్యాపారులతో రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, సభ్యులు రాములు నాయక్, భవానీ రెడ్డి మాట్లాడారు. గత నాలుగు రోజులుగా మార్కెట్ సెక్రెటరీ అందుబాటులో లేకపోవడంతో కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి అతడిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. బోయిన్ పల్లి మార్కెట్ లో రైతుల నుండి కొనుగోళ్లు, అమ్మకాల పై ఆరా తీశారు.
అధికారుల చాంబర్లు, రసీదులు, అటెండెన్స్ రిజిస్టర్, రికార్డులను చెక్ చేశారు. బోయిన్ పల్లి మార్కెట్ లో అమ్మకాలు కొనుగోళ్లకు సంబందించిన డేటాను సేకరించారు. అదే విధంగా కూరగాలయ వ్యర్థాలు ద్వారా బయో గ్యాస్ ప్లాంట్ ను పరిశీలించాడు. ప్లాంట్ పనిచేయడం లేదని తెలుసుకొని మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. బోయిన్ పల్లి మార్కెట్ కు పక్క రాష్ట్ర ల కూరగాయాలు వస్తున్నాయి చెన్నై, నెల్లూరు, యుపి, ఎంపి, మహారాష్ట్రాల నుంచి వస్తున్నట్లు తెలుసుకున్నారు. బోయిన్ పల్లి మార్కెట్ ను పరిశీలించిన బృందంలో రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, సభ్యులు రాములు నాయక్, భవానీ రెడ్డి, కమిషన్ అధికారులు హరి వెంకట ప్రసాద్, మహేష్ తదితరులు వున్నారు