Friday, July 25, 2025

బ్రిటన్, మాల్దీవుల పర్యటనకు ప్రధాని మోడీ

- Advertisement -
- Advertisement -

ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం నాలుగు రోజుల విదేశీ పర్యటనకు బయలుదేరారు. ఆయన బ్రిటన్, మాల్దీవులలో పర్యటిస్తారు. ఈ దశలో ప్రధాని ప్రకటన వెలువరించారు. బ్రిటన్ పర్యటన కీలకం అని, వ్యాపార, వాణిజ్య ఇతర రంగాలలో ఇరుదేశాలు ఉమ్మడి , సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం సంబంధాలు ఇటీవలి కాలంలో గణనీయ పురోగతి దశలో ఉన్నాయని విమానంలో వెళ్లే ముందు ప్రధాని స్పందించారు. తాము ప్రధాని కీర్ స్టార్మర్ ఇతార నేతలతో విస్తృత చర్చలు జరుపుతామని పేర్కొన్నారు.

కింగ్ ఛార్లెస్‌ను కూడా ప్రధాని మోడీ కలుసుకుంటారు. ఆ తరువాత ఆయన మాల్దీవులుకు వెళ్లుతారు. మాలేలో ప్రెసిడెంట్ మెహమ్మద్ ముయిజుతో చర్చలు జరుపుతారు. ఇరుదేశాల బెడిసికొట్టిన సంబంధాల , పెరిగిన అగాథాల తొలిగింపు క్రమంలో భారత ప ప్రధాని మోడీ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. అంతేకాకుండా మాల్దీవుల స్వాతంత్య్ర 60వ వార్షికోత్సవాలలో కూడా ఆయన పాల్గొంటారని అధికార వర్గాలు బుధవారం తెలిపాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News