Monday, July 28, 2025

మోత్కూర్ లో బిక్కేరు వాగుపై బ్రిడ్జి నిర్మించాలి… కోమటిరెడ్డిని కలిసిన సామేల్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/మోత్కూర్ : రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ని గురువారం తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ మర్యాద పూర్వకంగా కలిసి తుంగతుర్తి నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి పనులకు ప్రతిపాదనలను అందజేశారు. అభివృద్ధి పనులు మంజూరు చేయాలని కోరారు. అర్వపల్లి మండలంలోని ఎన్ హెచ్ -365 నుండి బొల్లంపల్లి గ్రామం వరకు బిటి రోడ్డు, అడ్డగూడూరు మండలం చౌళ్ళరామారం నుండి జానకిపురం గ్రామం వరకు బిటి రోడ్డు , శాలిగౌరారం మండలం రామగిరి గ్రామం నుండి గురుజాల గ్రామం వరకు బిటి రోడ్డు, తుంగతుర్తి మండల కేంద్రంలో తుంగతుర్తి నూతన ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం కోసం ప్రతిపాదించడం జరిగింది. మోత్కూర్ మండలానికి సంబంధించి హై లెవెల్ బ్రిడ్జ్ దాదాపు 300 మీటర్లతో (Bikkeru vaagu) బిక్కేరు వాగుపై బ్రిడ్జి నిర్మాణానికి ప్రతిపాదనలను మంత్రికి ఎమ్మెల్యే అందజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News