Sunday, July 27, 2025

క్రికెట్‌కు వేద కృష్ణమూర్తి గుడ్‌బై

- Advertisement -
- Advertisement -

టీమిండియా మహిళా క్రికెటర్ వేద కృష్ణమూర్తి అనూహ్య నిర్ణయం తీసుకుంది. 32 ఏళ్ల వేద శుక్రవారం అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. 2011లో అంతర్జాతీయ క్రికెట్‌కు శ్రీకారం చుట్టిన వేద టీమిండియాలో స్టార్ క్రికెటర్‌గా పేరు తెచ్చుకుంది. అద్భుత బ్యాటింగ్‌తో పలు మ్యాచుల్లో జట్టుకు అండగా నిలిచింది. కర్ణాటకలోని కడూర్ అనే చిన్న పట్టణం నుంచి వచ్చిన వేద మెరుగైన ప్రదర్శనతో టీమిండియాపై తనదైన ముద్ర వేసింది. వన్డే, టి20 వరల్డ్‌కప్‌లలో రన్నరప్‌గా నిలిచిన భారత జట్టులో వేద సభ్యురాలిగా ఉంది. వేద 48 వన్డేలు, 76 టి20లలో భారత్‌కు ప్రాతినిథ్యం వహించింది. అంతర్జాతీయ కెరీర్‌లో వే 1704 పరుగులు చేసింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News