Monday, July 28, 2025

రాష్ట్రంలో నాలుగు రోజుల పాటు వర్షాలు

- Advertisement -
- Advertisement -

గత వారం రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు వరుణుడు కొంత విరామం ఇచ్చాడు. ద్రోణి ప్రభావంతో మరో నాలుగు రోజులు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నా, ఈ వర్షాలు కొన్ని జిల్లాలకే పరిమితం అవుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. శనివారం రాష్ట్రంలోని ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో అక్కడక్క వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు, మెరుపులు, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలలు వీస్తాయని, ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. దీంతో పాటు కొన్ని జిల్లాల్లో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని, ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News