Sunday, July 27, 2025

కులగణన చూసి గర్విస్తున్నా…

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రత్యేక తెలంగాణ నిర్మాణానికి సోనియాగాంధీ చేసిన కృషి, తెలంగాణ ప్రజలతో, భాష సంస్కృతితో తమ ఆత్మీయ బంధాన్ని మరింత బలోపేతం చే సిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ ట్వీట్ చేశారు. ఈరోజు తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసి తనకు అపార గర్వం కలుగుతోందని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సామాజిక-, ఆర్థిక, జాతి సర్వే ప్రామాణికత, సమావేశం, సంప్రదింపులతో కూడిన విధానాన్ని తీసుకు న్న తీరు దేశవ్యాప్తంగా వచ్చే జనగణనలకు మార్గదర్శకంగా నిలుస్తుందని రాహుల్‌గాంధీ తన ట్వీట్‌లో తెలిపారు.

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కులగణన
సర్వే ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు, విద్యా సంస్థల్లో వెనుకబడిన తరగతులకు (ఓబిసి) 42 శాతం రిజర్వేషన్‌లు కల్పించడం ఒక చారిత్రాత్మక నిర్ణయమని రాహుల్‌గాంధీ తెలిపారు. ఈ రిజర్వేషన్ బిల్లు ప్రస్తుతం రాష్ట్రపతి ఆమోదం కోసం ఎదురుచూస్తోందని, తెలంగాణ మోడల్ అనేది దూరదృష్టితో కూడుకుందని రాహుల్ పేర్కొన్నారు. ఇది సామాజిక న్యాయం 2.0 -భారతదేశ భవిష్యత్‌ను నిర్మించే మార్గాన్ని నిర్వచించే దశగా నిలుస్తుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ట్వీట్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News