Sunday, July 27, 2025

పార్లమెంట్‌లో ఇక మాటల యుద్ధం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఆపరేషన్ సిందూర్ పై జూలై 28 లోక్ సభలో విసృ్తతస్థాయి చర్చ జరగనున్నది. సోమవారం నాడు చర్చను రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రారంభిస్తారు. మంగళవారం నా డు రాజ్యసభ ఇదే అంశంపై చర్చ చేపడుతుం ది.పార్లమెంటు వర్షాకాలం సమావేశాలు ప్రా రంభమైనప్పటినుంచీ ప్రతిపక్షాలు ఆపరేషన్ సిందూర్‌పై చర్చకు గట్టిగా పట్టు బడుతున్నా యి. శుక్రవారంనాడు జరిగిన అఖిలపక్షం స మావేశం తర్వాత ప్రతిపక్షాల డిమాండ్‌పై ప్రతిష్టంభన తొలగిపోయింది. ఆపరేషన్ సిందూర్, ఇతర అంశాలపై స్పీకర్ నిర్ణయం మేరకు చ ర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. లోక్ సభలో జరిగే చర్చలో హోం మంత్రి అమిత్ షా, విదేశాంగమంత్రి ఎస్ జైశంకర్, బీజేపీ ఎంపీలు అనురాగ్ ఠాకూర్, నిషికాంత్ దూబే పాల్గొంటారని పార్టీ వర్గాలవారు తెలిపారు. ప్రధాని నరేంద్రమోదీ లోక్ సభలో చ ర్చ సందర్భంగా జోక్యం చేసుకునే అవకాశం ఉంది.

అలాగే రాజ్యసభలోనూ చర్చ సందర్భం గా ప్రధాని మాట్లాడే అవకాశం ఉంది. మంగళవారం నాడు రాజ్యసభలో ఆపరేషన్ సిందూర్ పై జరిగే చర్చలోరక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్, విదేశాంగమంత్రి ఎస్ జైశంకర్ తోపాటు పలువురు ఎంపీలు పాల్గొంటారు. లోక్ సభలో ప్రతిపక్షనాయకుడు రాహుల్ గాంధీ, సమాజ్ వాదీ పార్టీ నాయకుడు అఖిలేశ్ యాదవ్ పాల్గొంటా రు. తెలుగు దేశం పార్టీ పార్టీ నుంచి లావు శ్రీ కృష్ణదేవరాయలు, జిఎం హరీష్ బాలయోగి ఆ పరేషన్ సిందూర్‌పై మాట్లాడే అవకాశం ఉంది. ఆపరేషన్ సిందూర్ పై జూలై 28న సోమవారం నాడు లోక్ సభలో 16 గంటలు, జూలై 29న మంగళవారంనాడు రాజ్యసభలో 16 గంటలు చర్చ జరుగుతుందని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖమంత్రి కిరెన్ రిజిజు తెలిపారు. అఖిల పక్షం సమావేశంలో ప్రతిపక్షాలు ఆపరేషన్ సిందూర్, బీహార్ లో ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ, ఇతరఅంశాలపై చర్చించాలని కోరాయని, అయితే అన్ని అంశాలనూ కలిసి చర్చించలేమని మంత్రి రిజిజు అన్నారు.

ఆపరేషన్ సిందూర్ పై ముందు చర్చ చేపడతామని, ఆ చర్చ తర్వాత ఇతర అంశాలపై తాము నిర్ణయం తీసుకోనున్నట్లు ఆయన విలేకరులకు తెలిపారు. ప్రతిపక్షాలు పహల్గామ్ టెర్రరిస్ట్ దాడి, ఆపరేషన్ సిందూర్ పై చర్చకు డిమాండ్ చేశాయి. అలాగే భారతదేశం , పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణకు తాను మధ్యవర్తిత్వం వహించానని అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ పదేపదే చేస్తున్న ప్రకటనలపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని కోరుతున్నాయని కేంద్రమంత్రి తెలిపారు. చర్చ సందర్భంగా ప్రధాని మోదీ సభలో ఉండాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేసినందువల్ల ఈ వారం ప్రధాని రెండు విదేశాల పర్యటనలో ఉన్నందువల్లనే వచ్చే వారం ఈ అంశంపై చర్చను షెడ్యూల్ చేసినట్లు తెలిపారు. జూలై 21 న పార్లమెంటు వర్షాకాలం సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి లోక్ సభ, రాజ్యసభ పదేపదే వాయిదా పడ్డాయి. రెండు సభలలో కొద్దిసేపే కార్యకలాపాలు సాగాయి. శుక్రవారం నాడు లోక్ సభస్పీకర్ ఓం బిర్లా చొరవతో అఖిలపక్షం సమావేశం జరగడంతో ప్రతిష్టంభన తొలగిపోయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News