Sunday, July 27, 2025

సర్కార్ దవాఖానాలో సుగర్ గోలీలేవి?

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ప్ర భుత్వాసుపత్రుల్లో ఇన్సూలిన్, మందులు లేక రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా రు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకు నే స్తోమత లేక ప్రభుత్వాసుపత్రులకు వెళితే అ క్కడ అవసరమైన మందులు ఉండటం లేదు. తెలంగాణ దేశంలో మధుమేహం ప్రబలంగా ఉన్న రాష్ట్రాల్లో మూడో స్థానంలో ఉన్నప్పటికీ, ప్రభుత్వ ఆసుపత్రులు, పిహెచ్‌సిలలో నాలు గు నెలలుగా ఇన్సులిన్ అందుబాటులో లేకపోవడంతో మధుమేహంతో బాధపడుతున్నవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రైవేటుగా కొనేందుకు డబ్బుల్లేక కొందరు ఉచితం గా ఇచ్చిన మందులనే తీసుకొని వెళ్తుండడం తో వ్యాధి నయం కావడం లేదు. ప్రభుత్వాసుపత్రుల్లో ఉచితంగా పంపిణీ చేయాల్సిన 863 ఔషధాల్లో, ప్రస్తుతం కేవలం 266 మాత్రమే అందుబాటులో ఉన్నట్లు తెలిసింది. దాంతో ప్ర భుత్వ వైద్యంపైనే ఆధారపడిన పేద రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పేదలు ప్రైవేటులో డబ్బులు ఖర్చు చేసి వైద్యం

చేయించుకోలేకప్రభుత్వ ఆసుపత్రులను ఆశ్రయిస్తుంటారు. అవసరమైన మందులు పూర్తిస్థాయిలో అందుబాటులో లేకపోవడంతో బయట కొనుక్కునే పరిస్థితి తలెత్తుతోంది. దాంతో పేద రో గులు లబోదిబోమంటున్నారు.రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఆసుపత్రుల్లో మెరుగైన వసతులు కల్పించేందుకు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నా, క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. చాలా ప్రభుత్వాసుపత్రుల్లో రోగులకు సరిపడా మందులు లభించడం లేదు. చికిత్స కోసం ప్రభుత్వాసుపత్రులకు వెళుతున్న నిరుపేదలకు ఆర్థిక భారం తప్పడం లేదు. రాష్ట్రంలోని ప్రభుత్వాసుపత్రుల్లో చికిత్స కోసం వచ్చే నిరుపేద రోగులకు మందుల కొనుగోలు పెను భారంగా మారుతోంది. చికిత్స వరకు ఉచితంగానే అందుతున్నా, మందులు మాత్రం పూర్తి స్థాయిలో దొరకడం లేదని బాధితులు వాపోతున్నారు. డాక్టర్లు రోగులకు ఐదారు రకాల మందులు రాస్తే, అందులో కేవలం ఒకటి లేదా రెండు రకాలకు మించి దొరకడం లేదు.

జీతాలు రాక కాంట్రాక్ట్ డాక్టర్ల ఇబ్బందులు
రాష్ట్రంలో వైద్యారోగ్య శాఖలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన విధులు నిర్వహిస్తున్న డాక్టర్లకు మూడు నెలలుగా వేతనాలు రాక ఇబ్బందులు పడుతున్నారు. రెగ్యులర్‌గా విధులు నిర్వర్తిస్తున్నా వేతనాలు రాకపోవడంతో ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. సకాలంలో వేతనాలు రాకపోతే కాంట్రాక్ట్ ప్రాతిపదికన విధులు నిర్వహిస్తున్న డాక్టర్లు తమ ఉద్యోగాలు వదిలేసే అవకాశం ఉంది. దాంతో ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యులు, సిబ్బంది కొరతకు దారితీయవచ్చు.

మేలుకోకపోతే ఇబ్బందే
రాష్ట్రంలో ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తున్నాయి. వానలతో దోమల ద్వారా వ్యాప్తి చెంది జ్వరాలు మొదలవుతాయి. ఈ సమయంలో ఒపి, ఐపిలకు వచ్చే రోగులు దాదాపు మూడింతలు ఆసుపత్రులకు తాకిడి పెరుగుతుంది. సాధారణంగా కొన్ని నెలలకుగా సరిపడా మందులను వైద్య శాఖ ముందస్తుగానే సమకూర్చుకుంటుంది. లేనిపక్షంలో వ్యాధులు విజృంభిస్తున్నప్పుడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు అవసరమైన ఔషధాలను యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు చేయడం కష్టమవుతుంది. అదేవిధంగా కాంట్రాక్ట్ ప్రాతిపదికన విధులు నిర్వహిస్తున్న డాక్టర్లకు సకాలంలో వేతనాలు చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. లేదంటే ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యుల కొరత ఏర్పడే అవకాశం ఉంటుంది.

ప్రభుత్వాసుపత్రుల్లో మందుల కొరత లేదు : డీహెచ్ డాక్టర్ రవీంద్ర నాయక్
రాష్ట్రంలో ప్రభుత్వాసుపత్రుల్లో ఎక్కడా మందుల కొరత లేదని రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ రవీంద్ర నాయక్ తెలిపారు. అన్ని రకాల మందులను ముందుగా సమకూర్చుకుని ఆసుపత్రులకు సరఫరా చేసినట్లు వెల్లడించారు. ప్రభుత్వాసుపత్రులకు వచ్చే రోగులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన అన్ని రకాల మందులు ఇచ్చేలా పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేశారని అన్నారు. ప్రస్తుతం మధుమేహం రోగులకు ఇచ్చే ఇన్సూలిన్ కూడా అన్ని ఆసుపత్రుల్లో అందుబాటులో ఉందని చెప్పారు. కాంట్రాక్ట్ డాక్టర్లకు పెండింగ్ జీతాలు చెల్లించేలా చర్యలు తీసుకుంటున్నామని, రెండు మూడు రోజుల్లో వారికి జీతాలు అందుతాయని వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News