న్యూఢిల్లీ : భారత సాయుధ దళాల డ్రో న్ యుద్ద తంత్రాన్ని మరింత పదును తే ల్చే ఆయుధాన్ని ఆంధ్రప్రదేశ్ లోని క ర్నూలు జిల్లాలో పరీక్షించారు. దేశీయం గా అభివృద్ధి చేసిన ఓ క్షిపణిని యూఏవీ లాంచ్‌డ్ ప్రెసిషన్ గైడెడ్ మిసైల్ (యూఎల్‌పీజీఎం)వీ3గా వ్యవహరిస్తున్నా రు. కర్నూలు జిల్లా లోని నేషనల్ ఓపెన్ ఏరియా రేంజి (ఎన్‌వోఏఆర్)లో ఈ ప్ర తిష్ఠాత్మక పరీక్ష జరిగింది. ఈ విషయా న్ని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్వ యంగా ఎక్స్ వేదికగా ప్రకటించారు. ఈ ప్రయోగానికి సంబంధించిన ఫోటో ను ఆయన పంచుకొన్నారు. డీఆర్‌డీవో ఈ క్షిపణి అభివృద్ధి, తయారీలో భాగస్వాములైన ఎంఎస్‌ఎంఈ, స్టార్టప్స్‌ను ఆయన అభినందించారు. సంక్లిష్టమైన టెక్నాలజీని అర్థం చేసుకోవడంతోపా టు, ఉత్పత్తి చేయగలిగే సత్తా భారత్‌కు ఉందని ఈ పరీక్ష నిరూపించిందన్నారు. గతంలో పరీక్షించి యుఎల్‌పిజిఎం వి2 ప్లాట్‌ఫామ్ పైనే దీనిని అభివృద్ధి చే శారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండ లం పాలకొలను సమీపంలో డీఆర్‌డీవో కు చెందిన ఎన్‌ఒఎఆర్ పరీక్ష కేంద్రాన్ని దీనికి ఎంచుకున్నారు. గతంలో కూడా డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్స్ వ్యవస్థను పరీక్షించేందుకు ఇదే వేదికను వాడారు.
ఈ ఆయుధం ఫిక్స్‌డ్ వింగ్ మానవ రహిత వి మానాలను కూల్చేందుకు వినియోగిస్తా రు. ఇక్కడ జరుగుతున్న ప్రయోగాలతో భారత్ డ్రోన్ యుద్ధతంత్రంలో ముందంజ వేస్తోంది.
డ్రోన్ నుంచి క్షిపణి ప్రయోగం
- Advertisement -
- Advertisement -
- Advertisement -