Monday, July 28, 2025

బాలిక గర్భవతి…. సజీవంగా పాతిపెట్టే యత్నం

- Advertisement -
- Advertisement -

భువనేశ్వర్: బాలికపై పలుమార్లు సామూహిక అత్యాచారం చేసి ఆమె గర్భవతి కావడంతో సజీవంగా పాతిపెట్టేందుకు ప్రయత్నించారు. ఈ సంఘటన ఒడిశా రాష్ట్రంలోని జగత్‌సింగ్‌పూర్ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… 15 ఏళ్ల బాలిక తన తల్లిదండ్రులతో కలిసి ఉంటుంది. బాలికపై భాగ్యదర్ దాస్, పంచనన్ దాస్ అనే సోదరులు కన్నేశారు. బాలికకు మాయమాటలు చెప్పి తన స్నేహితుడు తుళుబాబుతో కలిసి పలుమార్లు ఆమెపై ముగ్గురు సామూహిక అత్యాచారం చేశారు. బాలిక గర్భం దాల్చడంతో ఆమెను చంపాలని నిర్ణయం తీసుకున్నారు. గ్రామ శివారులోకి తీసుకెళ్లి బాలికను సజీవంగా పాతి పెట్టాలనుకున్నారు. తవ్విన గొయ్యిని చూసి బాలిక భయపడి వారి నుంచి తప్పించుకుంది. తన తల్లిదండ్రులకు బాలిక జరిగిన విషయం చెప్పడంతో వారు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. బాలిక ఆరోగ్య పరీక్షల నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News