Monday, July 28, 2025

తేలిపోయిన టీమిండియా

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/క్రీడా విభాగం: ఇంగ్లండ్‌తో మాంచెస్టర్ వేదికగా జరుగుతున్న కీలకమైన నాలు గో టెస్టులో టీమిండియా పేలవమైన ప్రదర్శనతో నిరాశ పరిచింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో భారత జట్టు ఆశించిన స్థాయిలో రాణించలేక పో యింది. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 358 ప రుగులకే కుప్పకూలింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్, కెఎల్ రాహుల్, సాయి సుదర్శన్, రిషబ్ పంత్, శార్దూల్ ఠాకూర్‌లు రాణించినా భారత స్కోరు 358 పరుగులకే పరిమితమైంది. ఏ ఒక్క బ్యాటర్ కూడా భారీ ఇన్నింగ్స్ ఆడక పోవడమే దీనికి ప్రధాన కారణంగా చెప్పొచ్చు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ వరుసగా రెండో టెస్టులోనూ విఫలమయ్యాడు. లార్డ్‌లో గిల్ రెండు ఇన్నింగ్స్‌లలోనూ తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరాడు.

తాజాగా నాలుగో టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లోనూ నిరాశ ప రిచాడు. గిల్ 12 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. యశస్వి, రాహుల్, సాయి సుదర్శన్‌లు కీలక సమయంలో పెవిలియన్‌కు చేరడంతో భారత్‌కు ఇబ్బందులు తప్పలేదు. వీరిలో ఏ ఒక్కరూ భారీ స్కోరు సాధించి ఉన్నా టీమిండియా మెరుగై న స్కోరును సాధించేది. కానీ కీలక ఆటగాళ్లు వి ఫలం కాడడంతో జట్టు ఆశించిన స్కోరును అందుకోలేక పోయింది. దీని ప్రభావం బౌలర్లపై స్పష్టం గా పడింది. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ ఓపెనర్లపై బౌలర్లు ఏమాత్రం ప్రభావం చూపలేక పోయారు. బెన్ డకెట్, జాక్ క్రాలీలు భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ ఇంగ్లండ్‌కు కళ్లు చెదిరే శుభారంభం అందించారు.

ఇదే పిచ్‌పై ఇంగ్లీష్ బౌలర్లు అద్భుత ప్రదర్శనతో అలరించిన సంగతి తెలిసిం దే. కానీ టీమిండియా బౌలర్లు ఇంగ్లండ్ ఓపెనర్లపై ఏమాత్రం ప్రభావం చూపలేక పోయారు. ఇప్పటి కే సిరీస్‌లో వెనుకబడిన భారత్‌కు ఈ మ్యాచ్‌లో నూ ఇబ్బందులు ఖాయంగా కనిపిస్తున్నాయి. మూడో రోజు ఆటలో కూడా ఇంగ్లండ్ బ్యాటర్లు అద్భుతంగా రాణించారు. ఓలి పోప్, జో రూట్‌లు మెరుగైన బ్యాటింగ్‌తో తమ జట్టును పటిష్ట స్థితిలో నిలిపారు. ఇప్పటికే భారత్ స్కోరును అధిగమించి న ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో భారీ ఆధిక్యం సా ధించడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదే జరిగితే సిరీస్‌ను సమం చేయడం టీమిండియాకు దాదాపు అసాధ్యమనే చెప్పాలి. కాగా, టీమిండియా బౌల ర్లు బుమ్రా, సిరాజ్, అన్షుల్, జడేజా, సుందర్, శా ర్దూల్‌లు పేలవమైన బౌలింగ్‌తో నిరాశ పరిచారు. ఇటు బ్యాటర్లు, అటు బౌలర్లు తేలిపోవడంతో భారత్ పీకల్లోతూ కష్టాల్లో కూరుకుపోయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News