భారత్‌తో నాలుగో టెస్టు
మాంచెస్టర్: భారత్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో ఆతిథ్య ఇంగ్లం డ్ మ్యాచ్‌ను శాసించే స్థితికి చేరుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ ఇప్పటికే 186 పరుగుల భారీ ఆధిక్యాన్ని దక్కించుకుంది. శుక్రవారం మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్ల నష్టానికి 544 పరుగులు చేసింది. కెప్టెన్ బెన్ స్టోక్స్ (77), లియామ్ డాసన్ (21) పరుగులతో క్రీజులో ఉన్నారు. శుక్రవారం ఓ వర్‌నైట్ బ్యాటర్లు ఓలి పోప్, జో రూట్‌లు అద్భుత బ్యాటింగ్‌తో ఇం గ్లండ్‌ను ఆదుకున్నారు. ఈ జోడీని విడగొట్టేందుకు భారత బౌలర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.
ఇటు రూట్ అటు పోప్‌లు భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ స్కోరును ముందుకు నడిపించారు. కీలక ఇన్నింగ్స్ ఆడిన పోప్ 128 బంతుల్లో ఏడు ఫోర్లతో 74 పరుగు లు చేసి ఔటయ్యాడు. ఈ క్రమంలో రూట్‌తో కలిసి మూడో వికెట్‌కు 144 పరుగులు జోడించాడు. హ్యారీ బ్రూక్ (3) మరోసారి విఫలమయ్యాడు. అయితే కెప్టెన్ స్టోక్స్‌తో కలిసి రూట్ ఇన్నింగ్స్‌ను ముందు కు తీసుకెళ్లాడు. చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడిన రూట్ 248 బంతుల్లో 14 ఫోర్లతో150 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 358 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే.