- Advertisement -
చౌటుప్పల్: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం భైతాపురం వద్ద శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని స్కార్పియో ఢీకొట్టడంతో ఇద్దరు మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. మృతులు ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఇద్దరు డిఎస్పీలు చక్రధర రావు, శాంతా రావుగా గుర్తించారు. ఇంటెలిజెన్స్ అండ్ సెక్యూరిటీ వింగ్‌లో విధులు నిర్వహిస్తున్నట్టు సమాచారం. ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్‌కు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. మితిమీరిన వేగం, నిద్రలేమి వలన ప్రమాదం సంభవించి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
- Advertisement -