- Advertisement -
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతిలో స్కూటరిస్టుపై చిరుత పులి దాడికి యత్నించింది. ప్రయాణికులు చిరుత నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. తిరుపతి జూపార్క్ రోడ్డులో చిరుత బైకుపై వెళ్తున్న వ్యక్తిపై దాడికి పాల్పడింది. స్కూటరిస్టు స్పీడ్ గా వెళ్లడంతో ఈ ప్రమాదం నుంచి బయటపడ్డాడు. వెనుకాల కారులో వస్తున్న ప్రయాణీకులు మొబైల్ ఫోన్ తో వీడియో రికార్డు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వరుస ఘటనలో ప్రయాణికులు, భక్తులు భయాందోళనకు గురవుతున్నారు. అటవీ విస్తీర్ణం తగ్గడంతోనే చిరుతలు జనవాసాల్లోకి వస్తున్నాయని నెటిజన్లు మండిపడుతున్నారు. అటవీ విస్తీర్ణం పెంచడంతో అటవీ జంతువులను రక్షించాల్సిన బాధ్యతను ప్రభుత్వాలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
- Advertisement -