యంగ్ హీరో నరేష్ అగస్త్య దర్శకుడు విపిన్ దర్శకత్వంలో సునేత్ర ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై ఉమా దేవి కోట నిర్మించిన మ్యూజికల్ రొమాంటిక్ డ్రామా ‘మేఘాలు చెప్పిన ప్రేమ కథ’ ( meghalu cheppina premakatha) తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ చిత్రంలో రబియా ఖతూన్ కథానాయిక. ఈ చిత్రం ఆగస్ట్ 22న గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో హీరో నరేష్ అగస్త్య మాట్లాడుతూ “విపిన్ చెప్పిన కథ నాకు చాలా నచ్చింది. తనతో వర్క్ చేయడం నాకు ఎంతో నచ్చింది. జస్టిన్ మ్యూజిక్ లో పనిచేయడం నా డ్రీమ్. తనతో వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంది.
మోహన్ చాలా అద్భుతంగా సినిమాని తీశారు. రబియా చాలా అద్భుతంగా నటించింది”అని అన్నారు. ప్రొడ్యూసర్ ఉమాదేవి కోట మాట్లాడుతూ “క్లీన్ ఫ్యామిలీ మూవీ ఇది. మంచి ఎమోషన్స్ (Good emotions)ఉంటాయి. మీరందరూ ఆదరిస్తే మరిన్ని సినిమాలు చేయాలని ఉంది”అని పేర్కొన్నారు. డైరెక్టర్ విపిన్ మాట్లాడుతూ “ట్రైలర్ అందరికీ నచ్చిందని భావిస్తున్నాము. సినిమా విజయం మీద చాలా నమ్మకంగా ఉన్నాము”అని తెలిపారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ రబియా, రాజా తదితరులు పాల్గొన్నారు.