మెగాస్టార్ చిరంజీవి సోషియో ఫాంటసీ విజువల్ వండర్ ‘విశ్వంభర’ (Vishvambhara) తో అలరించబోతున్నారు. అద్భుతమైన టీజర్, చార్ట్‌బస్టర్ ఫస్ట్ సింగిల్‌తో ఈ చిత్రం ఇప్పటికే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రతిష్టాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో విశ్వంభర ప్రత్యేక పుస్తకం లాంచ్ చేశారు. వశిష్ట దర్శకత్వంలో యువి క్రియేషన్స్‌పై విక్రమ్, వంశీ, ప్రమోద్‌లు విశ్వంభరను ఎపిక్ స్కేల్‌లో నిర్మిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి, మౌని రాయ్ పై చిత్రీకరించిన అద్భుతమైన డ్యాన్స్ నంబర్‌తో విశ్వంభర షూటింగ్ గ్రాండ్‌గా పూర్తయ్యింది. ఈ చిత్రం మొత్తం స్కోర్‌ను ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి కంపోజ్ చేస్తున్నారు. మాస్-అప్పీల్ ట్రాక్‌లతో అలరించే భీమ్స్ సిసిరోలియో ఈ హై-ఎనర్జీ డ్యాన్స్ నంబర్‌ను కంపోజ్ చేశారు.
శ్యామ్ కాసర్ల రాసిన ఈ పాట అభిమానులకు ఒక ట్రీట్ గా ఉండబోతోంది. పుష్ప, పుష్ప 2 చిత్రాలలో బ్లాక్ బస్టర్ పాటలకు కొరియోగ్రఫీ చేసిన గణేష్ ఆచార్య ఈ పాటకు డ్యాన్స్ కోరియోగ్రఫీ సమకూర్చారు. 100 మంది డ్యాన్సర్స్‌తో ఈ సాంగ్‌ను గ్రాండ్‌గా తెరకెక్కించారు. చిరంజీవి డ్యాన్స్ ఫ్లోర్‌లో(dance floor) తనదైన శైలి స్టెప్పులతో అదరగొట్టారు. మంచి డ్యాన్సర్ అయిన మౌని రాయ్ తనదైన స్పార్క్‌ని జతచేశారు. గ్రాండ్ స్కేల్ లో ఉన్న ఈ పాట విజువల్ వండర్‌గా ఉండబోతోంది. ఈ చిత్రంలో త్రిష కృష్ణన్ హీరోయిన్ గా నటిస్తుండగా, ఆషికా రంగనాథ్, కునాల్ కపూర్ ముఖ్యమైన పాత్రల్లో కనిపిస్తున్నారు.