Monday, July 28, 2025

కాపాడండి కాపాడండి అంటూ కన్నుమూసిన బిటెక్ విద్యార్థిని

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్‌ను లారీ ఢీకొట్టడంతో తండ్రి, కూతురు చనిపోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… షాద్‌నగర్‌లో మచ్చేందర్ అనే వ్యక్తి కుటుంబంతో కలిసి జీవిస్తున్నారు. ఆయన కూతురు మైత్రి బిటెక్ ఫస్టియర్ చదువుతోంది. తండ్రి కూతురును కాలేజీకి పంపించేందుకు బైక్‌పై బస్టాప్‌కు తీసుకెళ్తున్నాడు. షాద్‌నగర్ చౌరస్తా రాగానే బైక్‌ను ట్యాంకర్ ఢీకొట్టడంతో తండ్రి అక్కడికక్కడే మరణించాడు. మైత్రి లారీ టైర్ల మధ్య ఇరుక్కుపోయింది.

మైత్రి కాపాడాలని ఆర్తనాదాలు చేయడంతో అక్కడ ఉన్నవారు కన్నీంటి పర్యంతమయ్యారు. మొబైల్ ఫోన్ తీసి తన కుటుంబ సభ్యులకు ఫోన్ చేయాలని బతిమలాడింది. అదే సమయంతో స్నేహితురాలు ఫోన్ చేయడంతో ప్రమాదం గురించి ఆమెకు చెప్పారు. వెంటనే మైత్రి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఆర్తనాదాలతో యువతి చనిపోయింది. సిఐ విజయ్ కుమార్ ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News