- Advertisement -
కల్వకుర్తి: నాగర్ కర్నూల్ జిల్లాలో దుందుభి వాగులో ఓ వృద్ధుడు కొట్టుకుపోయాడు. కల్వకుర్తి మండలం రఘుపతిపేట వద్ద దుందుభి నది దాటుతుండగా వరద ఉద్ధృతికి వృద్ధుడు కొట్టుకుపోయాడు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తుండడంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. భారీ వర్షాలు కురవడంతో రోడ్లన్నీ జలమయంగా మారాయి. వరదలు ఎక్కువగా వస్తుండడంతో నదులు ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి.
- Advertisement -