రాజస్థాన్ లోని ఝూలావాడ్ జిల్లాలో పిప్లోడి గ్రామంలో పాఠశాల పైకప్పు ఒక్కసారిగా కూలిపోయింది. ఏడుగురు విద్యార్థులు చనిపోయారు. విద్యార్థులు 7.45 గం.లకు ప్రార్థన చేయడానికి సిద్ధవుతున్న సమయంలో 6,7 తరగతులపై ఉన్న పైకప్పు కూలిపోయింది. 28 మంది తీవ్రంగా గాయపడ్డారు. శిథిలాల కింద 35 మంది చిన్నారులు చిక్కుకుపోయారు. దీంతో ఉపాథ్యాయులు, స్థానికులు జాగ్రత్తపడి చిక్కుకుపోయిన విద్యార్ధులను బయటకు తీశారు. వీరిలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయాయి. 9 మంది గాయపడ్డారు. గాయపడిన వారిని పోలీసులు ఐసియు లో ఉన్నారని చెప్పారు. శిథిలావస్థలో పాఠశాల భవనం ఉందని చాలాసార్లు అధికారులకు తెలిపినా పట్టించుకోలేదని స్థానికులు విమర్శించారు. విద్యార్థులు చనిపోవడంతో తల్లిదండ్రులు తీవ్ర మనోవేదనకు గురైయ్యారు. పాఠశాలల విషయంలో ఇకనైనా ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ప్రభుత్వం జాగ్రత్త తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
స్కూల్ భవనం కూలిపోయిన ఘటనలో ఏడుకు చేరిన మృతుల సంఖ్య
- Advertisement -
- Advertisement -
- Advertisement -