- Advertisement -
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లాలోని పెద్దహబీపురం గ్రామంలో జనసేన నేత ఓ మహిళ జాకెట్ చింపేసి, చీర లాగేసి, ఆమెపై దారుణంగా దాడి చేశారు. పెద్దహాబీపురం గ్రామంలో అనసూయమ్మ అనే మహిళకు పొలం ఉంది. జనసేన నేత ఊస వెంకటరావు జెసిబితో అక్రమంగా రోడ్డు వేస్తున్నారు. అనసూయమ్మ, ఆమె కొడుకు సాయినాథ్ తో కలిసి జెసిబి అడ్డుకున్నారు. జనసేన నేత తన అనుచరులు ఆరుగురి కలిసి వారిపై దాడి చేశాడు. తన జాకెట్ చింపేసి, చీరలాగేసి దాడి చేశారని అనసూయమ్మ వాపోయారు. తమ ప్రభుత్వమని, తమను ఎవరు ఏం చేయలేరని, అడ్డొస్తే చంపుతామని తనకు, కుమారుడికి వెంకటరావు వార్నింగ్ ఇచ్చారని ఆమె తెలిపారు. అనసూయమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -