Monday, July 28, 2025

కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద సద్దుమణిగిన ఉద్రిక్తత

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బిఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పై దాడికి ఎన్ ఎస్ యుఐ పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆ పార్టీ కార్యకర్తలు ఎంఎల్ఎ ఇంటికి భారీగా చేరుకున్నారు. ఎన్ఎస్ యుఐ నేతలు ఆందోళన విరమించుకోవడంతో ఉద్రిక్తత పరిస్థితులు సద్దుమణిగాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎన్ ఎస్ యుఐ నాయకులు పాడి కౌశిక్ రెడ్డి పై దాడి చేసే అవకాశం ఉండడంతో గచ్చిబౌలి లోని పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి బిఅర్ఎస్ పార్టీ నేతలు,కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. కౌశిక్ రెడ్డి మాట్లాడిన విషయాల్లో తప్పేమీ లేదని బిఆర్ఎస్ కార్యకర్తలు నినాదాలు చేశారు. ఆయనపై దాడి జరిగితే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతాయని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసులు, అరెస్టులు, దాడులతోనే పరిపాలన కొనసాగిస్తున్నదని వారు విమర్శించారు. ప్రజలు కాంగ్రెస్ విధానాలను గమనిస్తున్నారని, భవిష్యత్‌లో ఆ పార్టీకి తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. శుక్రవారం బిఆర్ఎస్ భవన్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో కౌశిక్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఫోన్ ట్యాపింగ్‌కి సంబంధించి సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News