- Advertisement -
అమరావతి: పరిపాలన చేతకాని నాయకుడు దగ్గర పని చేసిన..ఎంపిలు, అధికారులు, ఎమ్మెల్యేలు జైలు పాలవుతున్నారని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి బిసి జనార్దన్ రెడ్డి (BC Janardhan Reddy) తెలిపారు. తప్పు చేసిన ఎవరికైనా శిక్ష తప్పదు అని అన్నారు. కొలిమిగుండ్ల మండలం తుమ్మలపెంట గ్రామంలో జరిగిన ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు వైసిపికి లేదని (YSRCP right to question) అన్నారు. వైనాట్ 175 అంటూ విర్రవీగిన మాజీ సిఎం జగన్ మోహన్ రెడ్డి కు..11 సీట్లు ఇచ్చి ఛీ కొట్టినా బుద్ధి రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
- Advertisement -