- Advertisement -
హైదరాబాద్: బిఆర్ఎస్ ఫోన్ ట్యాపింగ్ తో అధికార దుర్వినియోగం చేశారని మంత్రి చామల కిరణ్ కుమార్ రెడ్డి (Chamala Kiran Kumar Reddy) తెలిపారు. సెంటిమెంట్ తో చిచ్చు పెట్టే బిఆర్ ఎస్ ను ఎవరూ నమ్మడం లేదని అన్నారు. ఈ సందర్భంగా చామల మీడియాతో మాట్లాడుతూ..కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా బిఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ట్యాపింగ్ చేశారని, 16 మంది హీరోయిన్ల ఫోన్లు ట్యాపింగ్ (Tapping phones) చేశారని ఆరోపణలు ఉన్నాయని తెలియజేశారు. ఎన్నికల వేళ ఓటు వేయాలని ప్రజలను బ్లాక్ మెయిల్ చేసిన..కౌశిక్ రెడ్డి కూడా సిఎం రేవంత్ రెడ్డి గురించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డిపై విమర్శలతో ఫేమస్ అవ్వాలని చూస్తున్నారని చామల కిరణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.
- Advertisement -