Monday, July 28, 2025

భారత్కు బిగ్ షాక్.. ఒకే ఓవర్లో ఇద్దరు డకౌట్

- Advertisement -
- Advertisement -

ఇంగ్లాండ్ జట్టుతో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ కు ఆదిలోనే గట్టి దెబ్బ తగిలింది. ఇంగ్లాండ్ బౌలర్ క్రిస్ వోక్స్ తొలి ఓవర్ లోనే ఓపెనర్ యశస్వి జైస్వాల్ (0), సాయి సుదర్శన్(0)లను ఔట్ చేసి టీమిండియాను కష్టాల్లోకి నెట్టాడు. లంచ్ విరామం సమయానికి భారత్ మూడు ఓవర్లలో రెండు కీలక వికెట్లు కోల్పోయి ఒకే ఒక పరుగు చేసింది.ప్రస్తుతం క్రీజులో ఓపెనర్ కెఎల్ రాహుల్ (01), కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (0) క్రీజులో ఉన్నారు. అంతకుముందు తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ జట్టు 669 పరుగులు చేసి ఆలౌటైంది. దీంతో 310 పరుగుల భారీ ఆధిక్యాన్ని సాధించింది. ఇక, భారత్ తొలి ఇన్నింగ్స్ లో 358 పరుగులు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News