Monday, July 28, 2025

ఫెర్టీ9లో ఏఐ ఆధారిత మేల్ ఫెర్టిలిటి టెస్టింగ్ సెంటర్ ను ప్రారంభించిన సినీనటి లయ

- Advertisement -
- Advertisement -

ప్రపంచ ఐవిఎఫ్ దినోత్సవం సందర్బంగా ఫర్టీ9 ఫెర్టిలిటీ కొత్త అడుగువేసింది. మగవారి వీర్యకణాలను ఏఐ టెక్నాలజీ ద్వారా పరీక్షించేందుకు లెన్షూక్‌x12ప్రో సాంకేతికతను అందుబాటులోకి తీసుకు వచ్చినట్లు ఫర్టీ9 సంస్థ వెల్లడించింది. సికింద్రాబాద్‌లో జరిగిన టుగెదర్ ఇన్‌ఐవిఎష్ క్యాంపెయిన్ పేరుతో నిర్వహించిన కార్యక్రమానికి ప్రముఖ సినీనటి లయ ముఖ్యఅతిథిగా విచ్చేసి ఏఐ ఆధారిత మేల్ ఫెర్టిలిటి టెస్టింగ్ సెంటర్‌ను ప్రారంభించారు. ఈ సందర్బంగా లయ ఫెర్టి9 ద్వారా సేవ పొందిన దంపతులతో కలిసి తొలి సాంకేతిక మైలురాయిని ఆవిష్కరించారు. ఫెర్టి9 ద్వారా తల్లిదండ్రులుగా మారిన తమ కల గురించి సక్సెస్ స్టోరీలను పంచుకున్నారు. ప్రస్తుతం ఈ సంస్థ ఆంధ్రప్రదేశ్,తెలంగాణ రాష్ట్రాల్లో అత్యుత్తమ ఐవిఎఫ్ సెంటర్‌గా కొనసాగుతుందని నిర్వహకులు తెలిపారు. ఫెర్టీ9 మెడికల్ డైరెక్టర్ జ్యోతి సి బుడి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వినేష్ గదియా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News