- Advertisement -
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలపై ప్రభుత్వం ముందస్తు చ ర్యలు ప్రారంభించింది. అందులో భాగంగా ప్రతి జిల్లాకు రూ.కోటి చొప్పున నిధులను కేటాయించింది. తాజాగా ఆ నిధులను విడుదల చే స్తూ జిఓ జారీ చేసింది. రాష్ట్రంలోని 33 జిల్లాల కు జిల్లాకు ఒక కోటి రూపాయల చొప్పున రూ. 33 కోట్లను విడుదల చేసింది. ప్రాణ, ఆస్తి న ష్టం తగ్గించేందుకే ఈ తక్షణ నిధులు అవసరపడుతాయని ప్రభుత్వం పేర్కొంది. అంతేకాకుండా విపత్కర సమయాల్లో వాడుకునేందుకు కలెక్టర్లకు అత్యవసర నిధిని కేటాయిస్తామని సిఎం సమీక్షలో హామీనిచ్చారు. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికార యంత్రాంగా న్ని సిఎం రేవంత్‌రెడ్డి అప్రమత్తం చేశారు. అన్ని జిల్లా కలెక్టర్లు, వివిధ విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేసేలా దిశానిర్దేశం చేయాలని సిఎం రేవంత్ ఇప్పటికే ఆదేశించారు.
- Advertisement -