ప్రపంచంలో అత్యంత విశ్వసనీయ నేతగా ప్రధాని నరేంద్ర మోడీ గెలిచారు. మార్నింగ్ కన్సల్ట్ సంస్థ నిర్వహించిన గ్లోబల్ లీడర్ సర్వేలో ఇది వెల్లడైంది. ఈ విషయాన్ని తెలుపుతూ బీజేపీ నేత అమిత్ మాలవీయ ఎక్స్‌లో పోస్టు పెట్టారు. భారతీయులతోపాటు ప్రపంచ వ్యాప్తంగా మిలియన్ల మంది విశ్వసించే నాయకుడిగా ప్రధాని మోడీ అగ్రస్థానంలో నిలిచారని మాలవీయ పేర్కొన్నారు. భారత్ సురక్షితమైన చేతుల్లోనే ఉందన్నారు. ఈ ఏడాది జులై 410 మధ్య మార్నింగ్ కన్సల్ట్ ఈ సర్వే నిర్వహించింది. అందులో ప్రపంచంలో అత్యంత విశ్వసనీయత కలిగిన నాయకుడిగా 75 శాతం మద్దతుతో మోడీ మొదటిస్థానంలో నిలిచారు. 57 శాతంతో దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జేమ్యుంగ్ రెండో స్థానంలో ఉన్నారు.
ఆర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిలి, కెనడా ప్రధాని మార్క్‌కార్నీ తదితరులు ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 44శాతంతో ఎనిమిదో స్థానంలో నిలిచారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రజాదరణ కలిగిన నేతగా మోడీ పలుమార్లు తొలిస్థానంలో నిలిచారు. 2021 సెప్టెంబరులో మార్నింగ్ కన్సల్ట్ సర్వేలో ప్రధానికి 70 శాతం మద్దతు లభించింది. 2022 ప్రారంభంలో 71 శాతంతో అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడిగా ప్రపంచం లోనే మొదటి స్థానంలో ఉన్నారు. ఆ తర్వాత ఏప్రిల్, సెప్టెంబర్, డిసెంబర్‌ల్లో నిర్వహించిన సర్వేల్లో 76 శాతం మద్దతు దొరికింది. 2024 ఫిబ్రవరిలో 78 శాతంతో మరోసారి అగ్రస్థానానికి చేరుకున్నారు.