Sunday, July 27, 2025

బీజాపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌.. నలుగురు నక్సలైట్లు హతం

- Advertisement -
- Advertisement -

ఛత్తీస్‌గఢ్‌: బీజాపూర్ జిల్లాలో మరోసారి తుపాకుల మోత మోగింది. భద్రతా దళాలు జరిపిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు నక్సలైట్లు హతమైనట్లు ఛత్తీస్‌గఢ్ పోలీసులు శనివారం తెలిపారు.సాయంత్రం బీజాపూర్ నైరుతి ప్రాంతంలోని అడవిలో ఈ ఎన్‌కౌంటర్ జరిగిందని, మావోయిస్టుల గురించి పక్కా సమాచారం అందిన తర్వాత భద్రతా దళాలు ఆ ప్రాంతంలో నక్సల్ వ్యతిరేక ఆపరేషన్ ప్రారంభించాయని పోలీసులు తెలిపారు. ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని.. ఘటనాస్థలంలో నలుగురు మావోయిస్టుల మృతదేహాలతోపాటు INSAS, SLR రైఫిల్స్‌తో సహా పెద్ద మొత్తంలో ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (బస్తర్ రేంజ్) సుందర్‌రాజ్ తెలిపారు.

కాగా, ఈ సంవత్సరం ఛత్తీస్‌గఢ్‌లో భద్రతా దళాలు 225 మంది నక్సలైట్లను మట్టుబెట్టాయి. బీజాపూర్, బస్తర్, కాంకేర్, కొండగావ్, నారాయణపూర్, సుక్మా, దంతేవాడ జిల్లాల్లో భద్రతా దళాలు ఎక్కువగా ఎన్ కౌంటర్లు చేపట్టి.. మావోలపై విరుచుకుపడుతున్నాయి. మార్చి 31, 2026 నాటికి దేశాన్ని నక్సలిజం నుండి విముక్తి చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా భద్రతా సంస్థలను ఆదేశించిన నేపథ్యంలో మావోల ఎరివేత వేగంగా జరుగుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News