- Advertisement -
సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ ఏరియా ఆస్పత్రి ఆవరణలో శనివారం మగశిశువు మృతదేహం లభ్యమవడం స్థానికంగా కలకలం రేపింది. ఆస్పత్రి క్యాంటీన్ వెనుక భాగంలో ఈ శిశువు మృతదేహం కనిపించింది. శిశువు కాలికి ఆస్పత్రి బ్యాడ్జీ ఉండటంతో పోలీసులు ఈ ఘటనపై విచారణ ప్రారంభించారు. శిశువు మృతదేహం ఆస్పత్రి ఆవరణలోకి ఎలా చేరింది…మృతికి గల కారణాలు ఏమిటి.. ఇది ఆస్పత్రి నిర్లక్షమా లేక పారవేశారా.. అనే కోణాల్లో వివరాలు సేకరిస్తున్నారు. శిశువు తల్లితండ్రుల వివరాలను గుర్తించేందుకు ఆస్పత్రి రికార్డులను పరిశీలిస్తున్నారు. ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు.
- Advertisement -