Monday, July 28, 2025

ప్రధాని మోడీని ఆదర్శంగా తీసుకోవాలి:బండి సంజయ్

- Advertisement -
- Advertisement -

దేశ ప్రధాని నరేంద్ర మోడీని ఆదర్శంగా తీసుకోవాలని విద్యార్థులకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లా, హుస్నాబాద్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 10వ తరగతి విద్యార్థులకు ప్రధాని కానుకగా 450 సైకిళ్లను శనివారం ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ ప్రధాని నరేంద్ర మోడీ సూచన.. స్ఫూర్తితో దేశంలోని ప్రతి పార్లమెంట్ సభ్యులు వారి లోక్‌సభ నియోజకవర్గాల్లోని ప్రజలకు ఏదో ఒక మంచి పని చేయాలంటూ ఇచ్చిన పిలుపునిచ్చారని అన్నారు. ఈ మేరకు హుస్నాబాద్ నియోజకవర్గంలో మోడీ గిఫ్ట్ మేరకు ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదివే విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లను పంపిణీ చేశామన్నారు.

నిర్మల్ జిల్లాలో ప్రజా సంగ్రామ యాత్ర చేసినప్పుడు తనకు ఎదురైన అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఉచిత సైకిళ్లను పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు. విద్యార్థులకు మొట్టమొదటి ఆస్తి సైకిల్ అందజేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలలో చదవండి.. ఉచిత సైకిళ్లను బహుమతిగా పొందండి అంటూ హితవు పలికారు. ఉచిత సైకిళ్ల పంపిణీ ప్రతి ఏడాది కొనసాగిస్తామని తెలిపారు. విద్యారంగ అభివృద్ధికి ప్రధాని మోడీ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని అన్నారు. గత యుపిఏ హయాంలో విద్యారంగానికి 68 వేల 728 కోట్లు మాత్రమే కేటాయిస్తే.. ఈ ఒక్క ఏడాది లక్షా 28 వేల 650 కోట్ల రూపాయలు కేటాయించిందని.. గత 11 సంవత్సరాలలో విద్యారంగానికి దాదాపు 8 లక్షల కోట్లు కేటాయించిందని.. విద్యారంగంపై మోడీ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం అన్నారు.

ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించి.. విద్యార్థులు కాలర్ ఎగురవేసేలా చేస్తామని అన్నారు. త్వరలోనే నర్సరీ నుండి 6వ తరగతి చదువుకునే విద్యార్థులకు మోడీ కిట్స్ అందజేయనున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలలో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి కృషి చేస్తామన్నారు. చదువు వ్యక్తిగతంగానే కాకుండానే దేశానికి సమాజానికి ఉపయోగపడేలా ఉండాలన్నారు. కార్పొరేట్, ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు చదువులో రాణించాలని ఆకాంక్షించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News