- Advertisement -
రౌడీ భాయ్ విజయ్ దేవరకొండ, డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ తెరకెక్కిన క్రేజీ ప్రాజెక్టు కింగ్డమ్. ఇందులో విజయ్ కు జోడీగా భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించింది. ఇప్పటికే విడుదలైన సాంగ్, టీజర్ కు మంచి స్పందన వచ్చింది. తాజాగా తిరుపతిలో ఏర్పాటు చేసిన ఈవెంట్ లో ఈ మూవీ ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా.. మాస్ ఎలిమెంట్స్, యాక్షన్ ఎపిసోడ్స్ తో ఆకట్టుకుంటోంది. ఇందులో మునుపటి లాగా కాకుండా సరికొత్త విజయ్ దేవరకొండను చూపించాడు డైరెక్టర్. మరో హీరో సత్యదేవ్ కీ రోల్ చేస్తున్నాడు. ట్రైలర్ తో సినిమాపై భారీ అంచనాలు పెంచేసింది చిత్రయూనిట్. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్ బిజిఎంతో అదరగొట్టాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నాగవంశీ నిర్మించిన ఈ మూవీ జులై 31న ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున విడుదల కానుంది.
- Advertisement -