వివాహిత పురుగుల మందు త్రాగి ఆత్మ హత్యకు పాల్పడి చికిత్స పొందుతూ శనివారం మృతి చెందిన సంఘటన మండలంలో చోటుచేసుకుంది. ఇం దుకు సంబంధించి వివరాల్లోకి వెళ్తే దుమ్ముగూడెం మండలం బట్టిగూడెం గ్రామానికి చెందిన కనితి లలిత చర్ల మండలం బోధినెల్లి గ్రామానికి చెందిన గంగరాజుతో 10 సంవత్సరాల క్రి తం వివాహం అయింది. వీరికి ఇద్దరు పిల్లలు సంతానము, రెండు సంవత్సరాల క్రితం నుండి భర్తతో గొడవలు జరుగుతుండడంతో గత సంవత్సరం నుండి లలిత తన తల్లితండ్రుల ఇంట్లో ఉంటుంది. ఈక్రమంలో ఈ నెల 20వ తేదీ ఉదయం 9 గంటలకు తల్లితండ్రులు,
తన అక్కలు లలితను భర్త దగ్గరకు వెళ్లమని మందలించారు. భర్త వద్దకు వెళ్లడానికి ఇష్టపడని లలిత మనస్థాపానికి గురై క్షణికావేశంలో పురుగుల మందు తాగిఆత్మ హత్య ప్రయత్నం చేసింది. ఈ విషయాన్ని తల్లితండ్రులు గమనించి హుటాహుటిన భద్రాచలం హాస్పటల్ తరలించారు. అక్కడినుండి మెరుగైన వైద్యం కోసం 22వ తేదీన కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం తెల్లవారుజామున ఆరోగ్య పరిస్థితి విషమించి లలిత మృతి చెందింది. ఈ మేరకు మృతురాలి తండ్రి మల్లం రాజు దుమ్ముగూడెం స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.