- Advertisement -
కేరళలో శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షం రాష్ట్రంలోని అనేక ప్రాంతాలలో విధ్వంసం సృష్టించింది. నదులలో, డ్యాముల్లో నీటి మట్టం గణనీయంగా పెరిగింది. దాంతో ఐఎండి మూడు జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఆరెంజ్ హెచ్చరికలలో ఉన్న ఎర్నాకుళం, ఇడుక్కి, త్రిస్సుర్ జిల్లాలను రెడ్ అలర్ట్‌లోకి మార్చారు. కాగా పథనంతిట్ట, కొట్టాయం, పాలక్కాడ్, మలప్పురం, కొజికోడ్, వాయ్‌నాడ్, కన్నూర్, కాసర్గోడ్ జిల్లాలను మరి మూడు రోజులపాటు ఎల్లో అలర్ట్‌లోనే ఉంచారు. రెడ్ అలర్ట్ ఉన్న ప్రాంతాల్లో 24 గంటల్లో 20 నుంచి 24 సెమీ. వర్షం కురియొచ్చని, ఆరెంజ్ అలర్ట్ ఉన్న ప్రాంతంలో 11 నుంచి 20 సెమీ. వర్షం పడొచ్చని, ఇక ఎల్లో అలర్ట్ ఉన్న ప్రాంతాల్లో 6 నుంచి 11 సెమీ. వర్షం పడొచ్చని అర్థం.
- Advertisement -