Monday, July 28, 2025

సిద్దిపేటలో అస్మిత యోగాసన సిటీ లీగ్ పోటీలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/సిద్దిపేట అర్బన్: ఆగస్టు 2న సిద్దిపేటలో అస్మిత యోగాసన సిటీ లీగ్ పోటీలు జరగనున్నట్లు జిల్లా కలెక్టర్ హైమావతి తెలిపారు. శనివారం కలెక్టరేట్ కార్యాలయంలో పోటీ వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAI) ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా జరుగనున్న ‘అస్మిత యోగాసన సిటీ లీగ్ పోటీల్లో తెలంగాణ రాష్ట్రానికి ప్రతినిధిగా సిద్దిపేట ఎంపిక కావడం గర్వకారణం అని అన్నారు. ఈ పోటీలు ఆగస్టు 2న సిద్దిపేట విపంచి కళా నిలయంలో* నిర్వహించనున్నట్టు జిల్లా యోగాసనా స్పోర్ట్స్ అసోసియేషన్ ప్రకటించినట్లు తెలిపారు.

ఈ లీగ్ పోటీలు దేశవ్యాప్తంగా మహిళా సాధికారతను, క్రీడా సామర్థ్యాన్ని పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన వినూత్న కార్యక్రమంలో భాగం. తెలంగాణ రాష్ట్ర యోగాసనా స్పోరట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో, సిద్దిపేట జిల్లా యోగాసనా సంఘం నిర్వహణ బాధ్యతలు నిర్వహిస్తోంది. ఇందులో 18 ఏళ్లలోపు బాలికల విభాగం, 18 ఏళ్లకు మించి ఉన్న యువతులు, మహిళల విభాగం ఈ విభాగాల్లో ట్రెడిషనల్ యోగాసన, సుపైన్ ఇండివిజువల్ పోటీలు జరుగనున్నాయన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని యోగాసన సాధకులు (బాలికలు, మహిళలు) ఈ పోటీల్లో పాల్గొనవచ్చని సూచించారు. ‘ఈ అపూర్వ అవకాశం ద్వారా మహిళలు తమ ప్రతిభను ప్రదర్శించేందుకు ముందుకు రావాలని పోటీ విజయవంతం కావడానికి ప్రభుత్వ మద్దతు అందిస్తామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News