Monday, July 28, 2025

టీచర్ల పదోన్నతులకు గ్రీన్‌సిగ్నల్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఉపాధ్యాయుల పదోన్నతులకు ప్రభుత్వం పచ్చజెండా ఊపిం ది. ఉపాధ్యాయులకు సంబంధించిన పదోన్నతుల ద స్త్రంపై శనివారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంతకం చేసినట్లు సమాచారం. గెజిటెడ్ ప్రధానోపాధ్యాయు లు, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు, వివి ధ సబ్జెక్టుల స్కూల్ అసిస్టెంట్ ఖాళీల్లో ప్రమోషన్లు ఉ పాధ్యాయులకు పదోన్నతులు లభించనున్నాయి. రెం డు మూడు రోజుల్లో ఉపాధ్యాయుల పదోన్నతులకు సంబంధించిన షెడ్యూలు విడుదలయ్యే అవకాశం ఉంది.రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2 వేల మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు లభించే అవకాశం ఉంది. స్కూల్ అసిస్టెంట్లకు గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతి రావాల్సి ఉంది. గతేడాది సుమారు 1500 మంది స్కూల్ అసిస్టెంట్లకు పదోన్నతి కల్పించగా, వివిధ కారణాల వల్ల మల్టీజోన్-2లో పోస్టులు మిగిలిపోయాయి.

అలాగే పదవీ విరమణ వల్ల సుమారు 750 గెజిటెడ్ హెచ్‌ఎం పోస్టులు ఖాళీగా ఉన్నాయి. స్కూల్ అసిస్టెంట్లకు పదోన్నతి ఇచ్చి ఈ పోస్టులను భర్తీ చేయాల్సి ఉంటుంది. కొంతకాలంగా ఉపాధ్యాయులు దీనికోసం ఎదురుచూస్తున్నారు. తాజాగా దీనికి సంబంధించిన ఫైల్ క్లియర్ అయ్యింది. అదేవిధంగా గెజిటెడ్ హెచ్‌ఎం పదోన్నతులతో ఖాళీ అయ్యే స్కూల్ అసిస్టెంట్ పోస్టులను ఎస్‌జిటిలతో భర్తీ చేయనున్నారు. డిఎస్‌సి -2012 తర్వాత పీఈటీ, భాష పండితులకు కూడా అప్‌గ్రేడ్ చేయాల్సి ఉంది. వీరు దాదాపు 800 మంది ఉన్నారు. వారి పదోన్నతికి కూడా ప్రభుత్వం అనుమతించినట్లు సమాచారం. జూన్ 30 వరకు ఉన్న ఖాళీలను పరిగణలోకి తీసుకుని పదోన్నతుల ప్రక్రియ చేపట్టనున్నట్లు తెలిసింది. ఇప్పటికే చాలా పాఠశాలల్లో రెగ్యులర్ హెచ్‌ఎంలు లేకపోవడం వల్ల.. ఈ కొరత తీర్చేందుకు ప్రభుత్వం వేగంగా టీచర్లు పదోన్నతుల ప్రక్రియను పూర్తిచేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.

మరో 790 ప్రభుత్వ స్కూళ్లలో ప్రీ ప్రైమరీ
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మరో 790 ప్రీ ప్రైమరీ తరగతుల నిర్వహణకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే 210 పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతులు కొనసాగుతుండగా, తాజాగా మరికొన్ని సర్కారు బడుల్లో ప్రీ ప్రైమరీ ప్రారంభించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో మొత్తం 1000 ప్రభుత్వ పాఠశాలల్లో ప్రస్తుత విద్యాసంవత్సరం నుంచే ప్రీ ప్రైమరీ తరగతులు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి చదువుకునే అవకాశం ఉండగా ప్రైవేట్ స్కూళ్లలో నర్సరీ, ఎల్‌కెజి, యుకెజి తరగతులు నడుస్తున్నాయి. పిల్లలకు మూడేళ్ల వయసు నిండగానే తల్లిదండ్రులు ప్రైవేట్ పాఠశాలల్లో చేర్పించేందుకు ఆసక్తి చూపుతున్నారని, దానివల్ల ప్రభుత్వ పాఠశాలల్లో ఏటేటా విద్యార్థుల సంఖ్య తగ్గుతోందని భావించిన రాష్ట్ర ప్రభుత్వం సర్కారు బడుల్లో ప్రైమరీ ప్రైమరీ ప్రారంభించాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం పాఠశాలల్లో ప్రీప్రైమరీ తరగతుల నిర్వహణకు మార్గదర్శకాలు జారీ చేసింది.

నాలుగేళ్ల వయసులో అడ్మిషన్
వచ్చే విద్యాసంవత్సరం ఒకటో తరగతిలో ప్రవేశం పొందే విద్యార్థులకు సర్కారు బడుల్లో నిర్వహించే ప్రీ ప్రైమరీ తరగతుల్లో ప్రవేశం కల్పిస్తారు. ప్రస్తుతం ఐదేళ్లు నిండిన పిల్లలకు ఒకటో తరగతిలో ప్రవేశం కల్పిస్తుండగా, ప్రీ ప్రైమరీలో నాలుగేళ్లు నిండిన పిల్లలకు ప్రవేశాలు ఇవ్వనున్నారు. పాఠశాల విద్యాశాఖ, మహిళా సంక్షేమ శాఖ, వైద్యారోగ్య శాఖ సమన్వయంతో ప్రై ప్రైమరీ స్కూళ్లు కొనసాగునున్నాయి. ప్రభుత్వ పాఠశాలలో ప్రాంగణంలో ప్రధానోపాధ్యాయులు ఒక తరగతి గదిని ప్రత్యేకంగా ప్రీ ప్రైమరీకి కేటాయించాలని మార్గదర్శకాలలో పేర్కొన్నారు. ప్రీ ప్రైమరీ తరగతి గదిని చైల్డ్ ఫ్రెండ్లీ ఫర్నీచర్, వెంటిలేషన్ ఉండేలా చూడటంతోపాటు ఆ క్లాస్‌ను పిల్లలు సురక్షింగా ఉండేలా సుందరంగా అలంకరించాలని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News