Monday, July 28, 2025

ప్రభుత్వ ఆసుపత్రిలో మీల్స్ ఆన్ వీల్స్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/మిర్యాలగూడ రూరల్‌ః అన్ని దానాల్లోకెల్ల అన్నదానం మిన్న అనే సామేతను నిజం చేస్తూ మిర్యాలగూడ లయన్స్‌క్లబ్ సేవా కార్యక్రమాల్లో భాగంగా క్లబ్ సభ్యులు శనివారం మీల్స్ ఆన్ వీల్స్ కార్యక్రమం ద్వారా మిర్యాలగూడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలకోసం వచ్చిన రోగులకు, వారి సహాయకులకు, బంధువులకు, అనాధలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వితరణ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే బత్తుల లకా్ష్మరెడ్డి హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలో కూలీ పనుల నిమిత్తం వచ్చే వారికి, ఇతరులకు ఆకలి తీరుస్తూ మిర్యాలగూడ లయన్స్ క్లబ్ చేస్తున్న సేవలు అభినందనీయమని, రాష్ట్ర నలుమూలలనుంచి ప్రశంసలు పొందుతుందన్నారు.ఈ కార్యక్రమంలో లైన్స్ క్లబ్ సభ్యులు,కాంగ్రెస్ నాయకులు,తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News