Monday, July 28, 2025

స్పై కామెడీ, సీరియస్ కామెడీతో..

- Advertisement -
- Advertisement -

నిహాల్ కోధాటి, సూర్య శ్రీనివాస్ హీరోలుగా అక్కి విశ్వనాధ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్నయూనిక్ స్పై డ్రామా ‘చైనా పీస్’. (China Peace) మూన్ లైట్ డ్రీ మ్స్ బ్యానర్ లో తెరకెక్కిన ఈ చిత్రంలో కమల్ కామరాజు, రఘు బాబు, రంగస్థలం మహేష్, శ్రీనివాస్ వడ్లమాని, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రలు పోషించారు. హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో మేకర్స్ ఈ సినిమా టీజర్ ని రిలీజ్ చేశారు. పీపుల్ స్టార్ సందీప్ కిషన్ టీజర్ లాంచ్ ఈవెంట్‌కి ముఖ్య అతిధిగా విచ్చేసి టీజర్ ని లాంచ్ చేశారు. ఈ ఈవెంట్‌లో పీపుల్ స్టార్ సందీప్ కిషన్ మాట్లాడుతూ “ఇది ఒక స్పై ఫిల్మే కాదు, ఇందులో స్పై కామెడీ, సీరియస్ కామెడీ కూడా ఉన్నాయి.

దర్శకుడు ఈ కథని నమ్మాడు. నమ్మింది చిత్రీకరించాడు. సినిమా హిట్ కావాలని కోరుకుంటున్నా”అని అన్నారు. డైరెక్టర్ విశ్వనాథరెడ్డి మాట్లాడుతూ “ఒక దేశభక్తి సినిమా తీస్తూ చైనా పీస్ అనే పేరు పెట్టడం చాలెంజింగ్‌గా ఉంది. మేము అన్ని విభాగంలోనూ జాగ్రత్తలు తీసుకుని చాలా చక్కగా ఈ సినిమాని తీర్చిదిద్దాం”అని తెలిపారు. హీరో నిహా ల్ మాట్లాడుతూ “అన్ని రకాల కమర్షియల్ ఎలిమెంట్స్(Commercial elements) ఈ సినిమాలో ఉన్నా యి. తప్పకుండా ఈ సినిమా అందరికీ నచ్చుతుంది”అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హీరో సూర్య శ్రీనివాస్, కమల్ కామరాజు, హర్షిత, దీక్షా పంత్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News