డార్లింగ్ కృష్ణ, మనీషా హీరో హీరోయిన్లుగా శశాంక్ దర్శకత్వంలో రూపొందుతున్న మల్టీ లింగ్వల్ మూవీ ‘బ్రాట్’. (Brat) డాల్ఫిన్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై మంజునాథ్ కంద్కూర్ ఈ సినిమాని నిర్మించారు. తాజాగా మేకర్స్ ఈ సినిమా నుంచి యుద్ధమే రాని సాంగ్ ని రిలీజ్ చేశారు. సిద్ శ్రీరామ్ పాడిన ఈ పాటని నవరసరాయ డాక్టర్ నరేష్ వికే లాంచ్ చేశారు. ఈ ఈవెంట్‌లో డాక్టర్ నరేష్ వికే మాట్లాడుతూ “యూత్‌కి పర్ఫెక్ట్ ఫిలిం ఇది. టీజర్ చాలా బాగుంది. మ్యూజికల్ గా ఈ సినిమా సూపర్ హిట్. సిద్ శ్రీరామ్ పాడారంటే తప్పకుండా ఆ పాటలో విషయం ఉంటుంది”అని అన్నారు. డైరెక్టర్ శశాంక్ మాట్లాడుతూ “బ్రాట్ సినిమాని ఐదు భాషల్లో రిలీజ్ చేస్తున్నాము. కంటెంట్ మీద ఉన్న నమ్మకంతోనే ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నాము. అర్జున్ జన్య యుద్ధమే రాని పాటను అద్భుతంగా కంపోజ్ చేశారు”అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాత మంజునాథ్, హీరో డార్లింగ్ కృష్ణ, హీరోయిన్ మనీషా, శ్యామ్, సనారె పాల్గొన్నారు.
యుద్ధమే రాని..
- Advertisement -
- Advertisement -
- Advertisement -