Monday, July 28, 2025

మద్యం మత్తులో యువకుల ర్యాష్ డ్రైవింగ్.. చిన్నారి మృతి, తల్లిదండ్రుల పరిస్థితి విషమం

- Advertisement -
- Advertisement -

నోయిడా: మద్యం మత్తులో ఇద్దరు యువకుల ర్యాష్ డ్రైవింగ్ కు ఓ ఫ్యామిలీ బలైంది. అభం శుభం తెలియని ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోగా.. తల్లిదండ్రులు తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ ఘటన శనివారం అర్ధరాత్రి ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో జరిగింది. సెక్టార్ 30లోని PGI ఆసుపత్రి సమీపంలో ఓ BMW కారు అతివేగంగా వచ్చి.. స్కూటర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 5 ఏళ్ల బాలిక అక్కడికక్కడే మరణించింది. ఘటనలో చిన్నారి తల్లిదండ్రులు తీవ్రంగ గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. అనంతరం నిందితులను అదుపులోకి తీసుకుని.. వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. సెక్టార్ 30లో నిన్న అర్థరాత్రి.. మద్యం మత్తులో ఇద్దరు యువకులు నిర్లక్ష్యంగా అతివేగంతో BMW కారు నడిపారని.. ఓ వ్యక్తి తన భార్య, కూతురితో కలిసి స్కూటర్ పై వెళ్తుండగా ఢీకొట్టారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.సంఘటన జరిగిన సమయంలో ఇద్దరూ మద్యం మత్తులో ఉన్నారని అధికారులు నిర్ధారించారు. సంఘటన క్రమాన్ని నిర్ధారించడానికి సమీప ప్రాంతాల నుండి CCTV ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News