తూర్పు కాంగోలో (Congo) దారుణం చోటు చేసుకుంది. ఇస్లామిక్ స్టేట్ ప్రేరేపిత తిరుగుబాటుదారులు కొమండలోని క్యాథలిక్ చర్చి ప్రాంగణంలో దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో 21 మంది ప్రాణాలు కోల్పోయారు. పలు ఇళ్లు, దుకాణాలను తిరుగుబాటుదారులు తగలబెట్టారు. తెల్లవారుఝామున 1 గంటల ప్రాంతంలో ఈ దుర్ఘటన జరిగింది. ఈ దాడికి పాల్పడింది అల్లైడ్ డెమెక్రాటిక్ ఫోర్స్‌కు చెందిన వారిగా గుర్తించారు.
‘‘తిరుగుబాటుదారులు జరిపిన కాల్పుల్లో చర్చి లోపల, బయట కలిపి 21 మంది మరణించారు. మూడు దహనమైన మృతదేహాలను గుర్తించాము. పలు ఇళ్లు కూడా దహనమయ్యాయి. మిగిత మృతదేహాల కోసం గాలింపు కొనసాగుతుంది’’ అని డియుడోన్నే డురాంతబో అనే కొమండ సివిల్ సొసైటీ కోఆర్డినేటర్ తెలిపారు. అయితే కాంగో (Congo) ఆర్మీ మాత్రం మృతుల సంఖ్యను తక్కువగా వెల్లడించింది. చర్చి దగ్గర జరిగిన కాల్పుల్లో 10 మంది మృతి చెందారని లెఫ్టినెంట్ జూల్స్ న్గోంగో వెల్లడించారు.