- Advertisement -
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా బెళుగుప్ప మండలంలో విషాదం చోటుచేసుకుంది. తల్లి ఇద్దరు కూతుళ్లతో కలిసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. నక్కలపల్లి గ్రామంలో రాజేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి భార్య, ఇద్దరు కుమార్తెలతో కలిసి జీవిస్తున్నాడు. గత కొన్ని రోజుల కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయి. ఘర్షణలు తారాస్థాయికి చేరుకోవడంతో ఇద్దరు కూతుళ్లకు కువిజ్ఞా రెడ్డి(7), చైత్రా రెడ్డి(03) విష గుళికలు కలిపి ఇచ్చారు. అనంతరం తాను తిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు వెంటనే గుర్తించి ముగ్గురిని ఆస్పత్రికి తరలించారు. ముగ్గురు పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం అనంతపురం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -