- Advertisement -
గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయి 79 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురైన సంఘటన నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఉయ్యాలవాడలో గల మహాత్మాజ్యోతిబా పూలే బాలికల గురుకుల పాఠశాలలో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే.. స్థానికల ప్రకారం శనివారం రాత్రి భోజనం చేసిన తర్వాత 79 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురైయ్యారు. వెంటనే పాఠశాల సిబ్బంది చికిత్స నిమిత్తం విద్యార్థినులను ఆసుపత్రికి తరలించారు. 79 మందిలో 12 మంది డిశ్చార్జ్ అవ్వగా 67 మంది చికిత్స పొందుతున్నట్లు సమాచారం. పూర్తిగా తోడుకోని పెరుగు తినడం వల్లే విద్యార్థినులు అస్వస్థతకు గురైనట్లు డాక్టర్లు తెలిపారు.
- Advertisement -