Monday, July 28, 2025

మహారాష్ట్రలో లడ్కీ బెహన్ స్కీమ్ దుర్వినియోగం

- Advertisement -
- Advertisement -

మహారాష్ట్రలో లడ్కీ బెహన్ స్కీమ్ దుర్వినియోగం అయింది. ఆర్థికంగా వెనుకబడిన మహిళల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రవేశపెట్టిన లడ్కీ బెహన్ యోజన పథకం ప్రయోజానాలను 14 వేల మంది పురుషులు మోసపూరితంగా అందుకున్నారు. సంవత్సరానికి రెండున్నర లక్షలకన్నా తక్కువ ఆదాయం ఉన్న కుటుంబాల వారికోసం గత సంవత్సరం ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద 21 నుంచి 65 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న మహిళల కుటుంబాలకు నెలకు రూ.1600 హామీ ఇస్తుంది. 2024లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందు లడ్కీ బెహన్ స్కీమ్ అమలు చేపట్టారు. బీజేపీ నేతృత్వంలోని శివసేన , ఎన్ సిపి తో కూడిన ప్రభుత్వం ఓటర్లను ఆకట్టుకోవడంలో ఈ పథకం కీలకంగా మారింది. లడ్కీ బెహన్ స్కీమ్ దుర్వినియోగం అయిందని ఆరోపణలు రావడంతో దుమారం చెలరేగింది.

మహిళా, శిసు అభివృద్ధి శాఖ నిర్వహించిన ఆడిట్ లో ఈ పథకం కింద 14,298 మంది పురుషులకు రూ . 21 కోట్ల 44 లక్షలు పంపిణీ జరిగినట్లు తేలింది.ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ వ్యవస్థను తారుమారు చేసి, తమను తాము మహిళా లబ్ధిదారులుగా నమోదు చేసుకుని లాభపడ్డారు. పథకం ప్రారంభమైన 10 నెలల తర్వాత ఈ దుర్వినియోగం వెలుగులోకి వచ్చింది. పేద మహిళలకు సహాయం చేసేందుకు చేపట్టిన పథకం లడ్కీ బెహన్. పురుషులు లబ్ది పొందడానికి వీలు లేదు. వారు అందుకున్న డబ్బును తిరిగి వసూలు చేస్తాం, సహకరించని పక్షంలో వారిపై చర్యలు తీసుకుంటామని ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ తెలిపారు. లబ్దిదారుల జాబితాలో పురుషుల పేర్లను మోసపూరితంగా చేర్చడం ఓ సమస్యే. ఈ పథకం మొదటి సంవత్సరం పెద్దఎత్తున అనర్హుల పేర్లను నమోదు చేయడం వల్ల రూ. 1,640 కోట్ల మేరకు నష్టం జరిగింది.

ఈ పథకం ఒక కుటుంబంలో ఇద్దరు మహిళలకే వర్తిస్తుంది. కాగా మూడో మహిళా సభ్యురాలు చేరడంతో 7.97 లక్షల మంది మహిళల నుంచి తీవ్రంగా దుర్వినియోగం జరిగింది. దీనివల్లే ప్రభుత్వ ఖజానాకు రూ. 1,196 కోట్లు నష్టం వాటిల్లింది. అర్హుత వయోపరిమితి 65 సంవత్సరలే కాగా, 65 ఏళ్లు పైబడిన 2.87 లక్షల మంది మహిళలు కూడా ప్రోయజనం పొందడంతో రాష్ట్ర ప్రభుత్వానికి అదనంగా 431.7 కోట్లు అదనంగా నష్టమవుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News