Monday, July 28, 2025

ఎబిడి మాస్ ఇన్నింగ్స్.. మరో విధ్వంసకర శతకం

- Advertisement -
- Advertisement -

వరల్డ్ ఛాంపియన్‌షిప్ లెజెండ్స్‌లో సౌతాఫ్రికా దిగ్గజ బ్యాట్స్‌మెన్ ఎబి డివిలియర్స్ (AB de Villiers) ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తున్నాడు. తొలి మ్యాచ్‌ నుంచి అద్భుతమైన ఫామ్‌తో అదరగొడుతున్న ఎబిడి గురువారం ఇంగ్లండ్ ఛాంపియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 41 బంతుల్లో సెంచరీ చేసి శభాష్ అనిపించుకున్నాడు. కాగా, నేడు ఆస్ట్రేలియా ఛాంపియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో మరోసారి తన బ్యాట్‌ని ఝుళిపించాడు.

ఈసారి కేవలం 39 బంతుల్లోనే సెంచరీ సాధించి తనకు తానే సాటి అని నిరూపించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో 46 బంతులు ఎదురుకున్న డివిలియర్స్ (AB de Villiers) 15 ఫోర్లు, 8 సిక్సులతో 123 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. డివిలియర్స్‌తో పాటు జెజె స్మట్స్‌ కూడా మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. 53 బంతులు ఎదురుకొని 85 పరుగులు చేశాడు. అయితే ఆ తర్వాత వచ్చిన ఆటగాళ్లు పెద్దగా రాణించకపోయినా.. సౌతాఫ్రికా 20 ఓవర్లలో 6 వికెట్ల నష్ఠానికి 241 పరుగులు చేసింది. ప్రస్తుతం బ్యాటింగ్ చేస్తున్న ఆస్ట్రేలియా 10 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 73 పరుగులు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News